కార్తీకమాసంలో నదీస్నానం ఎందుకు చేయాలి.. ఆధ్యాత్మికమా.. సైంటిఫిక్​ రీజనా..!

కార్తీకమాసం కొనసాగుతుంది.  ఈ నెలలో నదీస్నానం చేయాలని పండితులు.. పురాణాలు  చెబుతున్నాయి.. ఈ నెలలోనే  నదీ స్నానం ఎందుకు చేయాలి.. ఇది కేవలం ఆధ్యాత్మికమైనా... సైంటిఫిక్​ రీజన్​ ఏమైనా ఉందా.. మొదలటు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం....

హిందువులు ఆచరించే ఆధ్యాత్మిక నియమావళికి.. సైన్సుకు.. ఆరోగ్యానికి దగ్గర సంబంధం ఉంటుంది.  కార్తీక మాసంలో నదీస్నానం చేయాలంటారు పండితులు.. ఇలా చేస్తే పాపాలు పోతాయని.. కోరిన కోర్కెలు నెరవేరుతాయని చెబుతున్నారు.  కార్తీక మాసం ఆధ్యాత్మిక మాసం. ఈ నెలలో చేసే నదీ స్నానానికి ...  శివ కేశవుల పూజకు అత్యంత విశిష్ట స్థానం ఉంది. కార్తీక మాసంలోని నెల రోజుల పాటు సూర్యోదయాని కంటే ముందే అంటే ఆకాశంలో నక్షత్రాలు ఉండగానే ప్రవహించే నీటిలో స్నానం చేస్తారు.  ఇలా నదీ స్నానం చేయడం వెనుక ఆరోగ్య రహస్యాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.  సహజంగా నైరుతి రుతుపవనాల కారణంగా వర్షాలు కురుస్తాయి.. ఈ నైరుతి పవనాలు ఆశ్వయుజమాసం వరకు ( వర్షాకాలం) ఉంటుంది.  తరువాత శీతాకాలం స్తుంది.  రుతుపవనాల వలన కురిసిన వర్షాలకు  వరద నీరు నదులకు చేరి  పొంగి ప్రవహిస్తుంది.  అయితే కార్తీకమాసం వచ్చేసరికి వరద ఉధృతి తగ్గుతుంది.
 
కార్తీకమాసంలో చలి మొదలవుతుంది.  చలికాలంలో వాతావరణానికి అనుకూలంగా శరీరాన్ని మలచుకునేందుకు .. కార్తీకమాసంలో నదీస్నానం చేయాలనే నియమం పెట్టారు.  చలిలో చన్నీరు చేయడం చాలా కష్టం.  నిల్వ ఉన్న నీటిలో స్నానం చేయాలంటే మరింత చల్లగా ఉంటుంది.  అందుకే  బద్దకం తీరేలా చన్నీటితో స్నానం చేయాలని అంటున్నారు నిపుణులు.  అప్పుడు శరీరం వెచ్చగా ఉంటుంది.  అదే వేడి నీటితో చేస్తే చేసినంత సేపు వెచ్చగా ఉన్నా  తరువాత మళ్లీ చల్లగా ఉంటుంది.  బద్దకంగా ఉండి ఏ పని సరిగా చేయలేము.  అందుకోసమే మన పెద్దలు కార్తీక స్నానం.. నదీ స్నానం అనే నియమాన్ని ప్రవేశపెట్టారు.  ..